చంటి పిల్లలకు తల్లిపాలతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ బ్లాక్ కో ఆర్డినేటర్ ఎం.హారిక అన్నారు. సోమవారం తల్లిపాల వారోత్స వాల సందర్భంగా టాటా ట్రస్ట్, ఏషియన్ పెయింట్స్ ఆధ్వర్యంలో రామన్నపాలెం గ్రామంలో తల్లిపాలు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మురిపాలు ఫస్ట్ టీకాలా పనిచేస్తాయన్నారు. పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచుతుంద సూచించారు. తల్లిపాలు పట్టడం వల్ల తల్లికి బిడ్డలకి ఆరోగ్య సమస్య లు నివారణ అవుతాయన్నారు. అనంతరం డబ్బా పాలు వద్దు తల్లిపాలే ముద్దు అంటూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి లాలం శ్రీను, నాయుడు అంగన్వాడీ టీచర్ పద్మ,పోశన్.సఖి అనూష, సివలక్ష్మి , ఎంఎల్ హెచ్పీ, ఆశా వర్కర్లు, పిల్లల తల్లిదండ్రుడు హాజరయ్యారు.