గొలుగొండ మండలంలోని కొత్త యల్లవరం గ్రామంలో ఈనాం భూమలు సర్వే కోసం మంగళవారం గ్రామస్తులతో గ్రామసభ నిర్వహించనున్నట్టు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన నర్సీపట్నంలో మీడియాతో మాట్లాడారు. అక్కడి భూముల సర్వే విషయమై అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టిని కలిసి అక్కడి పరిస్థితిని వివరించినట్టు పేర్కొన్నారు. అనంతరం నర్సీపట్నంలో ఆర్డీఓ తో కూడా ఇదే విషయమై చర్చించిన ఎమ్మెల్యే తొలుగ గ్రామ సభ ఏర్పాటు చేసి అనంతరం ఈనాం భూముల సర్వే చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇక్కడి భూములు సర్వేపూర్తయితే ఎల్లవరం గ్రామపంచాయతీ ప్రజలు త్వరలో రైతులందరికీ పట్టాదారు పుస్తకాలు మంజూరవుతాయని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వివరించారు.