రైతులకు అన్నింటా పెద్దపీట వేయాలి..ఆడారి కిషోర్


Ens Balu
62
Visakhapatnam
2023-08-09 08:57:55

దేశానికి వెన్నుముకలా నిలబడ్డ రైతులకు అన్నింటా పెద్ద పీట వెయ్యాలని, మిషన్ కర్షక దేవో భవ  చైర్మన్ ఆడారి కిషోర్ కుమార్ కోరారు.  బుధవారం విశాఖ నగరం లోని భీష్మ  కాలేజ్ విద్యార్థిని విద్యార్థులతో మిషన్ కర్షక దేవో భవ ప్రచార కార్యక్రమం లో భాగంగా 12వ రోజు అవగాహనా సదస్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన ఆహారం పండించే రైతులకు అత్యున్నత హోదా కల్పించాలన్నారు. మనం రోజు తినే ఆహారాన్ని పండించే రైతులుఅమ్మే కూరగాయలు ఇతర పంటలు కొనుగోలు సమయంలో ఎటువంటి బేరసారాలు చేయవద్దని.. ఎంతో శ్రమ చేసి పండిస్తే తప్ప అవి దిగుబడికి రావన్నారు. అలాంటి రైతులకు కృతఙ్ఞతలు చెప్పడం మన కనీస ధర్మం అన్నారు. అంతేకాకుండా రైతులకు ప్రతి ఆర్టీసి బస్సులోనూ,  ప్రత్యేక సీటు కేటాయించాలన్నారు.

  సమాజంలో తమ వంతు భాద్యతగా రైతాంగానికి సహకారాన్ని అందించాలన్నారు.  కర్షక దేవోభవ ప్రాజెక్ట్,  రైతులకు సంక్షేమం కోసం ప్రజల్లో అవగాహనా కల్పించేం దుకు అన్నిప్రాంతాల్లోనూ పర్యటిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులు ఖాళీ సమయాల్లో రైతులకు తగిన సహకారం అందించాలన్నారు. రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులను ప్రత్యేకించి అభినందించారు.  కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులు చేస్తున్న వ్యవయం, పంటల కోసం వివరించారు. యువత, విద్యార్ధినీ, విద్యార్ధులు ఈ మిషన్ లో వాలంటీర్లు గా చేరేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమం లో కాలేజ్ అధికారులు, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.