18ఏళ్లు దాటితే ఓటరుగా నమోదు చేయించుకోవాలి


Ens Balu
33
Visakhapatnam
2023-08-09 09:19:43

18ఏళ్లు నిండి అర్హత కలిగిన  ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేయించుకోవాలని విశాఖజిల్లా జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ తెలిపారు.  బుధవారం దక్షిణ నియోజక వర్గంలోని వెలం పేట పరిధిలో  91 మరియు 98 నెంబరు గల  పోలింగ్ బూత్  పరిధిలో గల  ఇంటింటికి ఓటరు సర్వే కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బి ఎల్ ఓలు డోర్ టు డోర్ వెరిఫికేషన్ కు వచ్చినప్పుడు ఓటరు వివరాలు, డోర్ నెంబరు సరిగా ఉన్నది, లేనిది ఓటరు బి ఎల్ ఓలను అడిగి తెలుసుకోవాలన్నారు . బి.ఎల్.ఓ డోరు టు డోరు సర్వే పై  స్థానికంగా అపార్ట్  మెంట్ లలో నివాసం ఉంటున్న ఓటర్లను కలిసి వివరాలను అడిగి తెలుసుకోవాలని అన్నారు. అదే విదంగా పాత వారి వివరాలు, కొత్తగా చేరిన వారి నమోదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటు అనేది భారత రాజ్యంగం మనకు కల్పించిన హక్కు అని, కుటుంబంలో ఎవరైనా 18 సంవత్సరాలు వయస్సు నిండిన  ప్రతి ఒక్కరూ భాద్యతగా తమ ఓటు నమోదు చేసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో విశాఖ పట్నం ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, మహారాణిపేట తాహాసీల్దార్ టి.ఆనంద్ కుమార్, బూత్ లెవెల్ అధికారులతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్ తదితరులు పాల్గొన్నారు.