సత్యదేవుడిని దర్శించుకున్న ఏపిఈఆర్సీ చైర్మన్
SatyaPrasad.Allada
21
Annavaram
2023-08-20 15:51:10
అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని ఏపిఈఅర్ సి చైర్మన్ వి.నాగార్జున రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఈమేరకు దేవస్థానం చైర్మన్ ఐ వి రోహిత్, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అంతరాలయంలో ఆయన స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందజేయగా, చైర్మన్ స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, అన్నవరం సత్యదేవుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆదేవ దేవుడిని ప్రార్ధించినట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, వేద పండితులు పాల్గొన్నారు.