ఆంధ్రప్రదేశ్ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ గా నియమితులై అనకాపల్లి వచ్చిన దంతులూరి దిలీప్ కుమార్ కు వైసిపి నాయకులు, కార్యకర్తలు, ఆయన అను చరులు బ్రహ్మరథం పట్టారు. సోమవారం ఉదయం అనకాపల్లి చేరుకున్న దిలీప్ కుమార్ ను రైల్వేస్టేషన్ నుండి ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చారు. పార్టీ కార్యా లయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను దంతులూరి దిలీప్ కుమార్ ఘనంగా సత్కరించారు. తర్వాత మంత్రి అమర్నాథ్ కూడా దిలీప్ కుమార్ ను అభినందిస్తూ సత్కరించారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్ మీద దిలీప్ కుమార్, మంత్రి అమర్నాథ్, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ తదిత రులు పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి పట్టణంలోని ప్రధాన మార్గాలగుండా ఊరేగింపుగా వెళ్లారు. దారి పొడవునా అభిమానులు దంతులూరికి, మంత్రి అమ ర్నాథ్కు పూలమాలలు వేసి సత్కరించారు. దంతులూరి అభిమానులు అతనిని ఒక క్రేన్ ద్వారా తీసుకువచ్చిన గజమాలతో సత్కరించారు. అలాగే విచిత్ర వేషధారణలు, బైక్ ర్యాలీలతో వైసిపి అభిమానులు హోరెత్తించారు.