శాంతిభద్రతలు విషయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎస్పీ సత్యనారాయణ సూచించారు. మంగళవారం పరవాడ సబ్ డివిజనల్ కార్యాలయంలో నెలవారి క్రైమ్ సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో గల పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎలమంచిలి, సబ్బవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో క్రైమ్ రేట్ పెరగకుండా చూడాలని శాంతి భద్రతల విషయంలో ఎటువంటి రాజీ పడవద్దని పోలీస్ స్టేషన్ లకువచ్చే బాధితులకు న్యాయం జరిగే విధంగా కేసులు నమోదు చేసి బాధ్యత యుతముగా వ్యవహరించాలని సిఐ, ఎస్ఐలకు సూచించారు. బాధితులు యొక్క సమస్యలు, ఫిర్యాదులు వివరాలను తెలుసుకుని వాటిని తొందరగా పరిష్కరించడానికి పని చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో,పట్టణ ప్రాంతాల్లో నిరంతరం పోలీస్ నిఘ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు .పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ అవి పని చేసే స్థితిలో ఉండే విధంగా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో పరవాడ పోలీస్ సబ్ డివిజన్లో గల సిఐలు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.