జగనన్న శాశ్వత భూహక్కు, మరియు భూ రక్ష ( రి సర్వే) లో భాగంగా మ్యుటేషన్ల పనులు వేగవంతం చేయాలని సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ ఆదేశిం చారు. జగనన్న శాశ్వత భూహక్కు, మరియు భూ రక్ష ( రి సర్వే) ప్రగతిపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో విజయవాడ నుంచి గురువారం సాయంత్రం వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మాట్లాడుతూ మ్యుటేషన్లు, పట్టాలకు సంబంధించిన పనులు వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. పలు అంశాలపై ఆయన చర్చించారు.ఫైనల్ ROR అయిన గ్రామాల్లో 100% స్టోన్ ప్లాన్టేషన్ పూర్తి చేయాలన్నారు. భూ రీసర్వే సందర్భంగా క్షేత్రస్థా యిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలన్నారు. వివాదాలు లేని భూరికార్డుల రూపకల్పనకు ప్రభుత్వం ఆధునిక పరిజ్ఞానంతో భూ సర్వే పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. భూ హక్కు పత్రాలు ముద్రణ కోసం మోడ్యూల్ లో ఉన్న క్లరికల్ కరక్షన్స్ అన్ని క్లియర్ చేయాలన్నారు. నిర్దేశి త గడువులోగా అధికారులందరూ రీసర్వే కింద అన్ని రకాల ప్రక్రియలను సమన్వయంతో పనిచేసి పూర్తి చేయాలన్నారు. ఈ వీడియో కాన్పరెన్స్ లో జిల్లా నుండి జా యింట్ కలెక్టర్ కే.ఎస్. విశ్వనాథన్ , తదితర అధికారులు పాల్గొన్నారు.