వైఎస్సార్సీపీ నేతలు విసన్నపేట భూములను అడ్డుగోలుగా దోచేస్తున్నారని జనసేన పార్టీ నాయకులు, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖలో శనివారం ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిపాలన రాజధాని పేరుతో విశాఖపట్నం కేంద్రంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనకాపల్లి నుండి భోగాపురం వరకు కోట్లాది విలువ చేసే భూములను దోచేస్తున్నారన్నారు. అడుగడుగునా జనసేన పార్టీ భూదోపిడిని ఎండగడుతున్న తరుణంలో వైఎస్సీర్సీపీ నాయకులు ఎదురు దాడికి దిగుతున్నారని భూ దోపిడీ జరిగింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. మాజీ ఇంచార్జి విజయ్ సాయి రెడ్డికి 300ఎకరాల భూమి గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చారని అన్నారు. ఈ భూమి విజయసాయి రెడ్డికి గురుదక్షిణ చెల్లించడం వల్లే అమర్ కు మంత్రి పదవి వచ్చిందని ఆయన తెలిపారు. ఎస్ ఆర్ షాపింగ్ మాల్ అధినేత గోపీనాథ్ రెడ్డి అమర్ కు బినామీ అని ఆయన పేరు మీద భూమి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. దాసరి అప్పారావు, దిమ్మల అప్పారావు, పల్లి అప్పలనాయుడు, బొడ్డేటి వసంతరావు సామాన్య వ్యక్తులని వారికి కోట్లాది రూపాయలు పెట్టి భూమి మీద కొనుగోలు చేసే స్తోమత నుంచి వచ్చిందని ప్రశ్నించారు. మంత్రి అమర్ కొండను తవ్వి ఎలుకను పట్టారని ఎద్దేవా చేస్తున్నారని పట్టింది ఎలుకను కాదని ఏనుగునని ఆయన చెప్పారు. అక్కడ ప్రభుత్వ భూముందని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారని ఆయన చెప్పారు. దంతులూరి వారి స్థలాలు ఆ పక్కనే ఉన్నాయని వారి భూముల్లోకి వారు వెళ్ళడానికి కూడా వైఎస్సార్సీపీ నాయకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
విస్సన్నపేట లో కొండలు, వాగులు, గడ్డలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. బత్తుల సుధాకర్ ఒక ప్రభుత్వ అధికారే ఉండి అవినీతికి పాల్పడుతున్నారని అని చెప్పారు. గతంలో ఈ సుధాకర్ పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆయన అన్నారు. మంత్రి అమర్ విస్సన్నపేటలో తనకి ఎటువంటి భూములు లేవని చెప్తున్నారు అని భూములన్ని బినామీ పేర్ల మీద పెట్టేసారని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి కారు చౌకగా ఉత్తరాంధ్ర భూములను కొట్టేస్తున్నారని ఆయన తెలియజేశారు. వైసీపీ నాయకులు పరిపాలన రాజధాని అని చెప్పి ఉత్తరాంధ్ర మొత్తం దోచేస్తున్నారన్నారు. ఈ భూములు మంత్రి బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. మంత్రి అవినీతి మంత్రాన్ని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయగలరని ఆయన సవాల్ విసిరారు. తర్లవాడలో 120 ఎకరాలు భూమిని కారు చౌక మంత్రి కొట్టేస్తున్నారు అన్నారు. ఈ భూమి విలువ 300 కోట్ల రూపాయలు ఉందని కేవలం 20 కోట్ల రూపాయలకు దోచుకుపోతున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అనకాపల్లి స్పోర్ట్స్ పర్సన్ ఎల్ గోపి, శ్రీరామదాసు గోవిందరావు , భరణిక రాము, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.