వనదుర్గమ్మ ఆలయంలో 6రోజులు చండీయాగం
SatyaPrasad.Allada
43
Annavaram
2023-08-26 14:10:40
శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, దిగువన ఉన్న శ్రీ వనదుర్గమ్మఅమ్మవారి ఆలయంలో ఆరు రోజుల పాటు నిర్వహించే చండీయాగం శనివారం ప్రారంభం అయ్యింది. నిజ శ్రావణ దశమి నుండి నిజ శ్రావణ శుద్ద పూర్ణమి వరకూ ఈ యాగం నిర్వహిస్తారని ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. తొలిరోజు కార్యక్రమంలో ఈఓ దంపతులు పాల్గొన్నారు. ఉదయం గణపతి పూజా , పుణ్యహావచనం , జపములు, మందపారాధనలు, నవగ్రహ, లింగార్చన, ములా మంత్రజపములు, చండీ , నవగ్రహా, బ్రహ్మ మందపారాధనలు, నవగ్రహా, లింగార్చన , ములా మంత్ర జపములు,చండీపారాయణలు, నవావరణార్చన, సూర్యనమస్కారములు, కౌమారీ (బాల) పూజ, సువాసినీ పూజా, అమ్మవారి గర్భగుడిలో కలశస్థాపన, బయట ముఖమడపంలో నిర్వహిస్తారు. రేపటి నుంచి మంగళవారం వరకూ ప్రతీరోజు ఉదయం పారాయణలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం గం.04.00 లకు లక్ష కుంకుమార్చన, చండీహోమము జరుగుతంది. తదుపరి మహానివేధన, నీరాజన మంత్రపుష్పములు మొదలగు కార్యక్రమములు నిర్వహించి 31వ తేది నిజ శ్ర్వన పూర్ణమి హురువరం రోజున ఉదయం 11.00 గంటలకు పూర్ణాహుతి తో యాగం ముగుస్తుంది ఈఓ వివరించారు.