అనకాపల్లి జిల్లాలో జరిగే ప్రసవాలు ఎక్కువగా ప్రభుత్వ డాక్టర్ల పర్యవేక్షణలో ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరగాలని జిల్లా కలెక్టర్ రవి పట్టణ శెట్టి వైద్యాధికారులను ఆదేశిం చారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కేసులు కూడా ఎక్కువగా ప్రభుత్వ ఆసుప త్రులలోనే చికిత్స చేయాలన్నారు. కష్టతరమైన కాన్పుకు అవకాశం ఉండే గర్భవతులను ముందుగానే ఆసుపత్రులకు తీసుకురావాలన్నారు. అదేవిధంగా స్టాఫ్ నర్స్ ఆశ కార్యకర్తలు వారికి ముందస్తు చికిత్సలను గురించి ముందస్తు జాగ్రత్తలను గూర్చి పూర్తి అవగాహన కలిగించాలన్నారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉండే సుఖప్రసవాలు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తగిన చికిత్స పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. డాక్టర్లు వైద్య సిబ్బంది గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ సమా వేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ హేమంత్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ శ్రవణ కుమార్, అనకాపల్లి నర్సీపట్నం జిల్లా ఆసుపత్రుల సూపరిండెంట్లు, చోడవరం నక్కపల్లి మాడుగుల ఎలమంచిలి కోటవురట్ల కె కోటపాడు ప్రాంతీయ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ఇతర డాక్టర్లు పాల్గొన్నారు.