బడిఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి


Ens Balu
36
Anakapalle
2023-08-26 14:18:36

5 సం. నుండి 18 సం.ల బడి ఈడు పిల్లలు ప్రతి ఒక్కరూ ఎక్కడైనా బడిలోనే చదువుతూ ఉండాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి చెప్పారు. శనివారం విద్యాశాఖ అధికా రులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన జి.ఈ.ఆర్. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (స్థూల నమోదు నిష్పత్తి) శత శాతంగా ఉండా లన్నారు. ఊరిలో పాఠశాలలో కాకపోతే వారు ఎక్కడ చదువుతున్నది అప్ లోడ్ చేయాలన్నారు. ఎంఈఓలు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సెక్రటరీలు క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితమైన సమాధానాన్ని  బుధవారం నాటికల్లా తెలియజేయాలన్నారు.  ఆధార్ నెంబరు మిస్ మ్యాచ్ అవ్వడం లేదా వలస వెళ్లడం మాత్రమే ఆప్షన్ గా ఉండా లన్నా రు.  ఊరిలో ఉన్న విద్యార్థుల పూర్తి సమాచారం వెల్ఫేర్ సెక్రటరీలు తప్పనిసరిగా సేకరించాలన్నారు. అదేవిధంగా అన్ని స్థాయిలలో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయాలన్నారు‌. ఈ సమావేశంలో జి ఎస్ వి ఎస్ ప్రత్యేక అధికారి మంజుల వాణి, డివైఇవో సుజాత, డీఈవో వెంకట లక్ష్మమ్మ, డిప్యూటీ డిఇఓ రవిబాబు, జిల్లాలోని ఎంఈఓ లు ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సెక్రటరీలు పాల్గొన్నారు.