అన్నవరం నుంచి కదిలిన స్వామివారి ప్రచార రథం
SatyaPrasad.Allada
43
Annavaram
2023-08-26 14:31:46
అన్నవరం శ్రీ వీరవేంకటసత్యన్నారాయణ స్వామివారి ప్రచార రథం శనివారం తూర్పురాజగోపురం నుంచి ప్రారంభం అయ్యింది. ఈరోజు నుంచి సెప్టెంబరు 25 వరకూ ధర్మ ప్రచార మాసోత్సవములలో భాగంగా గుమ్మలదోడ్డి,మారేడుమిల్లి, రంపచోడవరం, మోతిగూడెం, కుంట, చింతూరు, కూనవరం ప్రాంతాలలో పర్యటిస్తుంది. సదరు గిరజన గ్రామాలలో హిందూ ధర్మ ప్రచారం చేపడుతుంది. భక్తులకు దేవస్థానం ద్వారా ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతములు నిర్వహించే విషయాన్ని భక్తులకు తెలియజేస్తారు. శ్రీ స్వామివారి సత్య రథాన్ని పూజలు అనంతరం జెండాఊపి ప్రారంభించారు.