మదర్ థెరిసా ఆశయలతో ముందుకు సాగాలి


Ens Balu
36
Kamavarapukota
2023-08-26 17:41:12

మదర్ థెరిసా ఆశయ సాధనతో ముందుకు సాగాలని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి అన్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోటలో  వీరమల్ల మధు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ లోగోను జేసీ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ మదర్ థెరిసా  జయంతి రోజున ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ కష్టంలో ఉన్న వారిని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు. దేశంకానీ దేశం వచ్చి సేవా దృక్పథంతో ముందుకు సాగిన మదర్ థెరిసా  దేశంలోనే అత్యున్నత పురస్కారాలు పద్మశ్రీ, భారతరత్న, నోబుల్ పీస్ ప్రైస్, జవహర్లాల్ నెహ్రూ అవార్డులు అందుకున్నారన్నారు. కోవిడ్ సమయంలో సహాయ కార్యక్రమాలు చేసిన మధు అండ్ టీమ్ సభ్యుల సేవలను కొనియాడారు. సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేసి సంస్థను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని జేసీ లావణ్య వేణి సూచించారు. కార్యక్రమానికి ముందుగా మదర్ థెరిస్సా  చిత్రపటానికి పూలమాలు వేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సి వాయిస్ సీఈవో లింగుస్వామి, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ గౌరవాధ్యక్షులు తమ్మిశెట్టి సత్యనారాయణ, గౌరవ సలహాదారులు టీవీఎస్ రాజు, వీరమల్ల మధు, నీజాపరపు దుర్గాప్రసాద్ మున్నంగి శ్రీనివాస్, గోరికల వెంకటేశ్వరరావు, పండూరు రామ సాయి, వీరమల్ల నితిన్ సాయి, సౌజన్ సాయి,  నాగరాజు,  తదితరులు పాల్గొన్నారు.