వైఎస్సార్సీపీ మీద నమ్మకం ఉంచి గత ఎన్నికల్లో ప్రజలు అత్యధిక స్థానాలలో గెలిపించారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని అనేక హామీలు నెరవేర్చారని, అందుకే వచ్చే ఎన్నికల్లో కూడా వైసిపిని మళ్లీ అధికారులకు తీసుకురావాల్సిన బాధ్యత కార్యకర్తలు నాయకులపై ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి జిల్లా వైసీపీ నూతన కార్యవర్గ నియామకం ఆనకాపల్లి పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. నూతనంగా నియమితులైనకార్యవర్గ సభ్యులను మంత్రి అమర్నాథ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ శాలువులతో సత్కరించారు. అనంతరం సార్మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 55 మందితో నూతనకార్యవర్గాన్ని ఏర్పాటు చేశామని చాలా కీలకమైన సమయంలో ఈ కార్యవర్గం బాధ్యతలు తీసుకుందని అన్నారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిందని తెలిపారు. జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసి తిరిగి పార్టీని గెలిపించే బాధ్యత ఈ నూతన కార్యవర్గంపై ఉందని అమర్నాథ్ అన్నారు.
గత ఎన్నికలలో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని, ఏడు అసెంబ్లీ స్థానాలను వైసిపి కైవసం చేస్తుందని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత టిడిపివెంకటేష్ రెడ్డిఏతర పార్టీకి పూర్తి మెజార్టీ రావడం అదే ప్రథమని అమర్నాథ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే స్థాయిలో వైసీపీ విజయదుందుభి మోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలు నాయకులు మధ్య ఏవైనా విభేదాలు ఉంటేవాటిని పక్కనపెట్టి, పార్టీ విజయానికి కృషి చేయాలని, పార్టీ అధికారంలోకి వస్తే మరింతమంది కొత్త వారికి కూడా పదవులు దక్కే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో కష్టపడి విజయం కోసం పని చేసే వారిని గుర్తించి, భవిష్యత్తులో వారికి కీలక పదవులు లభించేటట్టు చూస్తామని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. వచ్చే ఐదు నెలలు కష్టపడితే, ఐదేళ్లపాటు మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలో ఉంటుందని అమర్నాథ్ అన్నారు.