బిసి సంక్షేమ సంఘం సేవలు అభినందనీయం


Ens Balu
40
Anakapalle
2023-08-27 14:39:27

బిసి సంక్షేమ సంఘం సేవలు అభినందనీయమని వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ అన్నారు. అనకాపల్లి విజయా రెసిడెన్సీ ఫంక్షన్ హాల్ లో బిసి సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం ఆ సంఘ అధ్యక్షులు మొల్లి రమణబాబు అధ్యక్షతన జరిగింది. తొలుత ఆ సంఘ నూతన కార్యవర్గ సభ్యులు చే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రత్నాకర్ మాట్లాడుతూ ఈ సంఘం చాలా కాలం నుంచి బీసీల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుందన్నారు. న్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బిసి లకు అన్నింటా సముచిత స్థానం కల్పిస్తున్నారని ఆయన అన్నారు. కాగా  అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి కి సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యావంతులైన  18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించి ఓటర్లుగా మార్చే కార్యక్రమం జరుగుతుందని ఆసంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో కొన్ని శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేకపోవడం వల్ల జిల్లా అభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉండడం లేదన్నారు. 
 బిజెపి సీనియర్ నాయకులు కొణతాల అప్పలరాజు తదితరులు ప్రసంగించారు. ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మొల్లి రమణబాబు  ఆధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు సిహెచ్ మహేష్ ,  జిల్లా మహిళా అధ్యక్షురాలు లొడగల శ్రీదేవి,  యూత్ కమిటీ మెంబర్గు మాసవరపు అప్పారావు, బండారు శ్రావణ కుమార్, అనకాపల్లి పట్టణ కమిటీ మహిళా అధ్యక్షురాలు అనుపమ, విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు ఎలమంచిలి ప్రసాద్, పెందుర్తి నియోజకవర్గం అధ్యక్షులు ఇసరపు వెంకట్రావు,  కార్యదర్శి శంకర్, ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా విభాగం కె. ఉమామహేశ్వరి, వాడచీపురుపల్లి అధ్యక్షులు మాస్వరపు వెంకయ్య నాయుడు, పోలమరశెట్టి రామకృష్ణ, సన్నాడ జగ్గప్పారావు, సింహా శ్రీను, నాగులాపల్లి వెంకటేష్ ,నాగరాజు, శేఖర్, కుమార్, బీసీ కార్యవర్గ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.