అన్నవరం సత్యదేవుడిని దర్శించుకున్న మంత్రి బూడి


Ens Balu
58
Annavaram
2023-09-03 15:47:58

అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా ఈఓ స్వామివారి ప్రసాదాలను మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది జిల్లా అధికారులు పాల్గొన్నారు.