జగనన్నకు చెబుదాంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి..కలెక్టర్


Ens Balu
38
Kakinada
2023-09-04 10:29:57

జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో అందిన వినతులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్ లో జరిగిన జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం(స్పందన) కార్యక్రమంలో డీఆర్‌వో కె.శ్రీధర్ రెడ్డి, జెడ్పీ సీఈవో ఎ.రమణారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్  ఈడీ డీఎస్ సునీత, డీఆర్డీఏ పీడీ కె. శ్రీరమణి, పౌరసరఫరాల డీఎం డి.పుష్పమణిలతో కలిసి హాజరయ్యారు. జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, పరిష్కరించవలసిందిగా  ఆయా శాఖల అధికారులను కలెక్టరు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌జ‌ల సంక్షేమం కోసం అమ‌లుచేస్తున్న వివిధ సంక్షేమ ప‌థ‌కాలు, రెవెన్యూ, పౌర సర‌ఫ‌రాల సేవ‌లు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి మొత్తం-357 అర్జీలు వచ్చాయి. ఈ సంద‌ర్భంగా జిల్లా కలెక్టరు కృతికాశుక్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టినందునా అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలన్నారు.  అధికారులు ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపు పరిష్కరించాలన్నారు. అర్జీదారుల సమస్యకి సంబంధించిన ఫోటోలను పరిస్కార నివేదికకు జత చేయాలని కలెక్టరు గగతెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ వివిధ సెక్ష‌న్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.