అనకాపల్లి జిల్లా కేంద్రంలోని కార్పోరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ పట్టణ వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు పేర్కొన్నారు. మంగళవారం 82వ వార్డు శారదా కాలనీలోని 3వ వీధిలో జరుగుతున్న డ్రైనేజి నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మందపాటి మాట్లాడుతూ, జివిఎంసీ నిధులతో, మంత్రి గుడివాడ అమర్నాధ్ సహకారం అభివృద్ధి పనులు అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతున్నారు. కాలువల నిర్మాణం వలన ఈ ప్రాంతంలోని ప్రజల మురుగనీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నిర్మాణ పనులను రాజీలేకుండా చేపట్టాలని ఇంజనీరింగ్ సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గైపూరి రాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.