వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జాబ్ కేలండర్ ఎక్కడ


Ens Balu
20
Visakhapatnam
2023-09-05 14:22:49

వైఎస్సార్పీపీ ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లలో ఒక్క జాబ్ కేలండర్ కూడా సక్రమంగా నిర్వహించలేకపోయారని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఘాటుగా విమర్శించారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ  మంగళవారం విశాఖలోని ఎంవిపి కాలనీ సమతా కళాశాల నుండి ఏఎస్ రాజా కళాశాల వరకు నిరుద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, ప్రభుత్వం జీవో నెంబర్ 98ని తక్షణమే రద్దు చేయాలన్నారు. గ్రూప్ టూ ఉద్యోగాలు వెయ్యి కి పెంచాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో గొప్పలకు పోయి జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటనలు చేసి అరకొర ఉద్యోగాలు చేతులు దులుపుకున్న అసమర్ధ ప్రభుత్వం వైఎస్సార్సీపీదే అన్నారు.  నిరుద్యోగులను నట్టేట ముంచి మోసం చేసిన వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. గ్రూప్ వన్ గ్రూప్ టు పోస్టులు వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.  నిరుద్యోగులకు న్యాయం చేస్తానని చెప్పి మోసం చేసిన జగన్ రెడ్డి మోసగాడిగా రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడన్నారు. చంద్రబాబు హయాంలో ప్రతియేట ఉద్యోగాలు కల్పనతోపాటు నిరుద్యోగ భృతికూడా ఇచ్చేవారన్నారు. రాబోయేది చంద్రబాబు ప్రభుత్వమేనని అపుడు నిరుద్యోగుల కష్టాలు గట్టెక్కుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ సిద్దు, కో కన్వీనర్ పవన్ కుమార్ భారీగా నిరుద్యోగ యువత పాల్గొన్నారు.