కమనీయం సింహాచలం అప్పన్న కల్యాణం


Ens Balu
46
Simhachalam
2023-09-20 05:58:43

విశాఖలోని సింహాచలం శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామివారి నిత్య కల్యాణం బుధవారం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూ ర్తి గోవింద  రాజ స్వామిని ఉభయ దేవేరులతో  మండపంలో అధిష్టింపజేశారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పురోహితులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.