సైకో క్రిమినల్ జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి


Ens Balu
44
2023-09-22 09:47:02

భారత రాజ్యాంగాన్ని సజీవ సమాధి చేస్తున్న సైకో గ్యాంగ్ పరిపాలనకు ప్రజలు చరమ గీతం పాడాలని విశాఖ ఆర్ కె బీచ్ లో రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. శుక్రవారం ఉదయం  బీచ్ లో రాష్ట్రంలోరాజ్యాంగ విలువలు పాతర వేశారని నినదిస్తూ పీకల్లోతు ఇసుకలో నిలబడి  టిడిపి నేతలు నిరసన చేశారు. ఈ నిరసన లో నోడగల కృష్ణ, తమ్మినేని మోహన్ లు చంద్రబాబు అరెస్టు వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా  కృష్ణ మాట్లాడుతూ ఎన్ని అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకి వస్తారని చెప్పుకొచ్చారు. సైకోవిధానాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే బుద్ది చెబుతారని చెప్పారు.  ఈ కార్యక్రమంలో  చంద్రబాబు కు అండగా మేము సైతం ప్ల కార్డ్ లు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వర కుమార్, కుమార్ స్వామి, పసుపులేటి శ్రీనివాస్, కోనేటి సురేష్ ,ముక్కాశివ, సతీష్ లు, ధనజీ, తాతినేని యర్రబోలు శ్రీను తో పాటు టిడిపి కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ వినూత్న నిరసన లో పాల్గొన్నారు.