విశాఖలోని పాతనగరం కురుపాం మార్కెట్ లోని 145ఏళ్ల చరిత్ర గలిగిన కన్యకాపరమేశ్వరి ఆలయంలో అక్టోబర్ 15వ తేదీ నుంచి అక్టోబరు 24వ తేదీ వరకు వాసవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుచున్నట్లు దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు ఆరిశెట్టి దినకర్, గ్రంధి రామకృష్ణారావులు తెలిపారు. ఈమేరకు ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మూలవిరాట్ ను ప్రతిరోజు రోజుకొక అవతారమూర్తి రూపంలో విశేష అలంకరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మహిళలచే, కన్యలచే, విద్యార్థులచే వివిధ రకాల సామూహిక పూజా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు స్వయంగా అమ్మవారిని దర్శించుకుని పూజాదికాలతో పాటు పరోక్ష పద్ధతిలో తమ గోత్రనామాలు ముందుగా దేవాలయంలో సంప్రదించి నామమాత్రపు రుసుము చెల్లించివారికి వారి పేరున శరన్నవరాత్రుల్లో ప్రతీరోజు పూజాదికాలు నిర్వహించి ప్రసాదం భక్తులకు అందజేసే విధంగా ఏర్పాటు చేసినట్లుతెలిపారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మూలవిరాట్ కు ప్రతిరోజు తెల్లవారుజామున ప్రత్యేక పంచామృతాభిషేకాలు, హోమ కార్యక్రమాలు, మరియు సామూహిక పూజలు నిర్వహిస్తునట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనం కలిగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థాన సంఘం కోశాధికారి సుగ్గు శివకుమార్, దేవాలయ ప్రధాన అర్చకులు ఆర్ బి బి కుమార్ శర్మ, ఉత్సవ కమిటీ అడ్వైజర్లు, కమిటీ నెంబర్లు పాల్గొన్నారు.అక్టోబర్ 15వ తేదీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారం మరియు మహిళలచే సామూహిక లలితా పారాయణం; అక్టోబర్ 16వ తేదీ అన్నపూర్ణ దేవి అవతార అలంకరణ మరియు కన్యలచే సామూహిక పూజ; 17వ తేదీ గాయత్రీ దేవి అలంకరణ మరియు మహిళలచే సామూహికంగా సుహాసిని పూజ; 18వ తేదీ రాజరాజేశ్వరి దేవి అవతారం అలంకరణ మరియు సామూహికంగా దిశా గౌరీ పూజ; 19వ తేదీ ధనలక్ష్మి దేవి అవతార అలంకరణ మరియు మహిళలచే సామూహికంగా లలితాదేవి పారాయణ; అక్టోబర్ 20వ తేదీ సరస్వతి దేవి రూపంలో అలంకరణ మరియు 1200 మంది విద్యార్థులతో మూడు విడతలలో సరస్వతీ పూజ, అక్టోబర్ 21వ తేదీ నాడు శాకాంబరీ దేవి అవతార అలంకరణ మరియు మహిళల సామూహికంగా విష్ణు లక్ష్మీ కమల పూజ; అక్టోబర్ 22వ తేదీ మహాలక్ష్మి దేవి అలంకరణ మరియు మహిళలచే ధైర్యలక్ష్మి పూజలు; అక్టోబర్ 23వ తేదీ నాడు కాళీమాత అవతార అలంకరణ మరియు మహిళలచే సౌభాగ్యవ్రతం; మరియు శమీపూజ; అక్టోబర్ 24వ తేదీ దుర్గాదేవి అలంకరణ మరియు చండీ హోమం, 25వ తేదీ ఉదయం ఉద్వాసన మరియు మధ్యాహ్నం పేదలకు నారాయణ సేవ. మరియు సాయంత్రం మేళ తాళాలతో భారీ ఎత్తున ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.అన్ని కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కమ్మని కోరారు.