వెంగళరాయసాగరం రిజర్వాయర్ లో 2లక్షల చేపపిల్లల విడుదల


Ens Balu
51
Parvathipuram
2023-10-11 11:05:21

మత్స్యకారులు ఆర్ధికంగా అభివృద్ధి చెందేందుకు వీలుగా రిజర్వాయలలో చేపపిల్లల పెంపకాన్ని ప్రభుత్వం చేపడుతున్నదని విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాల కులు ఎన్.నిర్మలకుమారి పేర్కొన్నారు. బుధవారం విజయనగరం ఫిష్ సీడ్ ఫారం నుంచి 2లక్షల చేపపిల్లలను తీసుకొని వెళ్లి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం అన్నమరాజువలసలోని వెంగళరాయసాగరం రిజర్వాయర్ లో విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రిజర్వాయర్ లలో పెంచుతున్న చేపపిల్లలు మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 8 ఎంఎం ఫిష్ పింగర్ లింక్స్ ను విడుదల చేసినట్టు చెప్పారు. లైసెన్స్ సిస్టమ్ ఉన్న ఈ రిజర్వాయర్ లో 412 మంది మత్స్యకారులు ఆధాపడి జీవిస్తున్నారని ఆమె తెలియజేశారు. వారందరికీ ప్రస్తుతం విడుదల చేసిన చేపపిల్లలు అందివస్తాయని అన్నారు.  వైస్ ఎంపిపి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం మత్స్యకారుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు చిన్నప్పన్న, ఉపాధ్యక్షులు లక్ష్మణరావు, డైరెక్టర్ వెంకటరావు, మన్యం డిఎఫ్ఓ తిరపతయ్య, ఎంపీడీఓ, ఎఫ్డీఓలు శ్రీనివాసు, శ్రీదేవి, గ్రామ సర్పంచ్,  జెడ్పీటీసిలు, ఎంపిటిసిలు, మత్స్యశాఖ సిబ్బంది,  మత్స్య సహకార సంఘ సభ్యులు పాల్గొన్నారు.