పిల్లలు స్మోకింగ్ జోలికి వెళ్లకుండా అవగాహన కల్పించాలి


Ens Balu
25
Visakhapatnam
2023-10-22 05:43:40

 పిల్లలను అత్యంత ప్రమాదకరమైన స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్ల కు లోనూ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పై ఉందని తెలుగు దేశం యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ అన్నారు. ఆదివారం విశాఖలోనీ బీచ్ రోడ్ లో నిర్వహించిన నో స్మోకింగ్ డే అవగాహన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిగరెట్, మత్తు పదార్థాలు, బీడీ వంటి ధూమపానం వస్తువులు వాడడం ద్వారా కోట్లాది మంది గుండె, కాలేయం, ఊపిరి తిత్తుల చెడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రభుత్వాలు ఆదాయం కోసం ఈ దుర్వ్యసనాలకు అనుమతి ఇచ్చి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి వ్యక్తి ఉదయం పూట సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, స్వచ్ఛ మైన ఉదజని పీల్చడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.  అప్పుడు మాత్రమే కాలుష్యం లేని గాలి దొరుకుతుందన్నారు. స్మోకింగ్ , త్రాగుడు వంటి దుర్మార్గపు లక్షణాల జోలికి వెళ్లకుండా తమ పిల్లలకు  ప్రతి తల్లి, తండ్రి అవగాహన కల్పించాలన్నారు. 
కన్సుమర్ రైట్స్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఈ అవగాహన శిబిరం లో ఆ సంస్థ అధ్యక్షులు గొర్లె శ్రీనివాసులు నాయుడు, ఎంపి జి వి ఎల్ నరసింహా రావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఉదయానికి మద్దతుగా  అతిథులు, ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు.