కాకినాడలో వీదికుక్కలకు మాస్ వేక్సిన్ టీకాలు..
Ens Balu
4
2020-07-06 22:32:59
కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్ లోని వీధి కుక్కలకు మాస్ వాక్సినేషన్ (టీకాలు) కార్యక్రమాన్ని కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ కమషనర్ స్వప్నిల్ దినకర్ ఈ రోజు ప్రారంభించారు. ప్రపంచ జునిసిస్ దినోత్సవం సందర్భంగా స్థానిక వివేక నంద పార్క్ వద్ద వీధి కుక్కలకు టీకాలు కార్యక్రమాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలు సహకారం తో కమిషనర్ ప్రారంభిస్తూ, ఈ టీకాలు కార్యక్రమ ము 2 నెలలు నగరంలో కొనసాగుతుంది అని వివరించారు. నగర ప్రజలు, స్వాచంద్ద సంస్థలు మరియు జంతు సంరక్షణ మరియు ప్రేమికులు ఈ కార్యకరమానికి సహకరించాలని, అలాగే మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది వీధి కుకలను తీసుకువెళ్లే సమయాలలో వారికి స్థానిక నాయకులు ప్రజలు అవరోధాలు కల్పించకుండా ఈ టీకాలు కార్యక్రమాన్ని విజయంతంగా పూర్తి చేయాలని కమిషనర్ దినకర్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అదనపు కమషనర్ నాగ నరసింహ రావు, హెల్త్ ఆఫసర్ ప్రశాంత్, కుక్కల కుటుంబ నియంత్రణ సమన్వయ కర్త డాక్టర్ బెహరా, ఆంధ్ర ప్రదేశ్ గోశాల ఫెడరేషన్ కో ఆర్డినేటర్ శ్యామ్, జంతు ప్రేమికులు చంద్ర మౌళి, గోపాల్,సుసి, యితర జంతు ప్రేమికులు మరియు మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.