రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలు ఉద్యమించాలి: ఆడారి కిషోర్ కుమార్


Ens Balu
37
Yalamanchili
2023-10-29 13:48:29

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం 25 ఏళ్ల క్రితమే తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకులు చంద్ర బాబు నాయుడని, కేవలం రూ 125. కోట్ల కోసం కక్కుర్తి పడి వ్యక్తి కాదని 
తెలుగుదేశం యువనాయకులు ఆడారి కిషోర్ కుమార్ అన్నారు. డెమెక్రసీ ఇన్ డేంజర్ పేరుతో డిల్లీ నుంచి ప్రజా చైతన్యం మొదలు పెట్టిన ఆయన ఆదివారం అనకాపల్లి జిల్లా యలమంచిలిలోనూ ప్రజా చైతన్య కార్యక్రామాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరిగిన ఐటి రంగం వైపు తొంగి చూసిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడేనని అన్నారు. ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి రూ.125 కోట్లు ఆలోచిస్తారా, ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతి రావు మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఇలాంటి తేడా ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు. టిడిపి అధినేత వెంట రాష్ట్రం మొత్తం ఉందనే విషయం వైఎస్సార్సీపి ప్రభుత్వానికి త్వరలోనే తెలుస్తుందని అన్నారు.

యలమంచిలి జనసేన నియోజవకర్గ నాయకులు సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఒక విజన్ ఉన్న వ్యక్తిని, వయసులో పెద్దవారిని, మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుందన్నారు. వైఎస్సార్సీపీ కక్షసాధింపుకి రాష్ట్రప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ఎలాంటి ఆధారాలు చూపకుండా 50రోజులు పాటు ఒక మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడం అంటే రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. జైభీమ్ భారత్ పార్టీ నాయకులు కారెం వినయ్ ప్రకాష్ మాట్లాడుతూ, అరాచక శక్తులు రాష్ట్రాన్ని పాలిస్తే ఇలాంటి చర్యలే ప్రజలు చూడాల్సి 
వస్తుందన్నారు. అధికారం ఎక్కడ చేజారి పోతుందోనని భయంతో చంద్రబాబుని జైల్లో పెట్టారని ఆరోపించారు. పాల్తేటి పెంటారావు మాట్లాడుతూ, ఒక కుటుంబాన్ని వేధించడం కోసం ఏకంగా ప్రభుత్వం మొత్తం పనిచేస్తుందని, ఆ శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై చూపిస్తే మెరుగైన ఫలితాలు వచ్చేవన్నారు. చంద్రబాబుని జైల్లో పెట్టడం వెనుక ఒక ప్రధాన కారణం ఉందని, ఆయన బయట ఉంటే ఎక్కడ ఎన్నికల్లో ఓడిపోతామోననే భయం వీరిని వెంటాడుతోందన్నారు. ఈకార్యక్రమంలో యలమంచిని 
ప్రాంతానికి చెందిన వక్తలు పాల్గొన్నారు.