కరక రంగురాళ్ల క్వారీపై రాజస్థాన్ రిపోర్ట్..?!


Ens Balu
485
golugonda
2025-02-01 14:52:02

గొలుగొండ మండంలోని కరక రంగు రాళ్ల క్వారీలో లభ్యమవుతున్న అలెక్స్ సిసలైన పచ్చవైడూర్యం మామూలు రాయి కాదు.. దేశంలోనే అత్యంత విలువైన రాయి.. ఈ రాయిని మిషన్ పై కోతవేసి రూపు రాళ్లకి మరింత గిరాకీ.. ఇక్కడ సంపదను వెలికి తీస్తే భారత దేశం అగ్రరా జ్యం అమెరికాను మించిపోతుంది.. అత్యంత సంపన్నమైన దేశంలా మారుతుంది.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తూ.. కరక రంగు రాళ్ల క్వారీలోని రంగురాయిని నవరత్నాల ల్యాబులో పరిశీలించిన నిపుణులు.. ఏకంగా రూ.25 లక్షలు ఖర్చు చేసి మరీ రాయి నాణ్య తను పరిశీలన చేయించారట.. దానితో కరక ప్రాంతం మొత్తం వసమైతే రాత్రి రాత్రికి దేశంలోని అత్యంత సంపన్నులు అయిపో వాలనేది వ్యాపా రుల లక్ష్యం.. అంతే రంగంలోకి గనులు భూగర్భ శాఖ అధికారులను రంగంలోకి దించారు.. విషయం ఏంటంటే సుమారు 20 హెక్టార్ల కొండ ప్రాంతాన్ని పదేళ్లకు లీజుకి తీసుకోవడానికి.. కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది.. రంగురాయి వ్యవహారం బగ్గుమంది..?!

అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలంలోని కరక రంగురాళ్ల క్వారానీ ఎలాగైనా లీజుకి అధికారికంగా కాజేయాలనే రంగురాళ్ల వ్యాపారుల ప్రయత్నం బెడిసి కొట్టింది. దేశంలోనే అత్యంత విలువైన రంగురాళ్లు లభ్యమయ్యే రంగురాళ్ల క్వారీని కొందరు ప్రజాప్రతినిధుల అండతో లీజు రూపంలో కొట్టేయాలని చూసిన ప్రయత్నం వెనుక వేల కోట్ల రూపాయల ప్లాన్ దాగి వుందంటే అతిశయోక్తి కాదేమో. అవును మీరు చదువుతున్నది అక్షరాలా నిజం. కరక రంగు రాళ్ల క్వారీ కోసం తెలియని దేశం లేదు.. ఇక్కడ దొరికే అత్యంత విలువైన రంగురాళ్లని కొనని రంగురాళ్ల వ్యాపారీ లేడు. అంతెందుకు ఇక్కడ వ్యపారం చేసిన గేదెలను కాసే రైతు నర్సీపట్నంలో కోటీశ్వరుడయ్యాడు.. టీ షాపు నిర్వహించే ఛాయ్ వాలా సూపర్ మార్కెట్ ఓనర్ అయ్యాడు.. ఇపుడు ఏకంగా అంతకుమించి ఆదాయం మళ్లీ అదే రంగు రాయి నుంచి వస్తుంటే ఎవరు మాత్రం వదిలేస్తారు చెప్పండి.

 దానికోసమే.. రంగురాళ్ల వ్యాపారులంతా సిండికేట్ గా ఏర్పడి కరక రంగు రాళ్ల కొండ కొట్టేయడానికి పక్కాగా ప్లాన్ వేశారు. గనులు భూగర్భ శాఖ ద్వారానే అధికారికంగా లీజు తీసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అంతా అఫిషియల్ గానే పావులు కదిపారు. దీనితో నిషేధిత అటవీ ప్రాంతంలోకి గనులు భూగర్భ శాఖ అధికారులు ఎంటర్ అయ్యారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు మోకాలు అడ్డుపెట్టారు. ప్రభుత్వ సమాచారం, అధికారిక లేఖ లేకుండా ఏవిధంగా రిజర్వు ఫారెస్టులోకి అడుగు పెడతారని.. 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్న ప్రాంతంలో సర్వేలు ఎలా చేస్తారంటూ అనధికార వ్యవహారం నడుపుతున్న వారిని అదపులోకి తీసుకున్నారు. అయితే సాధారణ సర్వే అనే అందరికీ తెలిసినా విషయం విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్ జరిగిన రంగు రాళ్ల వ్యాపారుల సమావేశం కాస్త బయటకి వచ్చేసింది. దీనితో పక్కా ప్లాన్ ప్రకారమే మైనింగ్ అధికారులు కరక రంగురాళ్ల కార్వీలోకి అడుగుపెట్టినట్టు తేలిపోయింది. 

అయినా రిజర్వు ఫారెస్ట్ లోకి వెళ్లాలంటే ముందుగా అటవీశాఖ అనుమతి తీసుకోవాలి. లేదంటే జిల్లా జాయింట్ కలెక్టర్ అనుమతి అయినా తప్పని సరి.. అవేవీ లేకుండా  నర్సీపట్నం భూగర్భ గనుల శాఖకు చెందిన రాయల్టీ ఇన్స్పెక్టర్ సత్యమూర్తి ని, ఆశాఖ ఉన్నతాధికారులు సర్వేకి వెళ్ళమని ఆదేశించారని.. ఇదే విషయాన్ని అటవీ శాఖ అధికారులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొనడం ఇపుడు చర్చనీయాంశం అవుతున్నది. ఎన్నికల ముందు జరిగిన రంగురాళ్ల వ్యాపారుల సిండికేట్ వ్యవహారం ప్రభుత్వం ఏర్పాటు కాగానే లీజు దక్కించుకునేందు తెరవెనుక ఉన్న వ్యాపారులు, ప్రజాప్రతినిధులు సీఎఓం స్థాయిలో పావులు కదుపుతున్నట్టు సమాచారం అందుతుంది. అయితే  మైనింగ్ అధికారులతో పాటు గతంలో రంగురాళ్ల స్మగ్లింగ్  కేసులు ఉన్న కొందరు వ్యక్తులు కూడా, రిజర్వ్ ఫారెస్ట్ లోకి ప్రవేశించడం ఇప్పుడు కొత్త అనుమానాలకు తెరతీస్తున్నది. 

మైనింగ్ అధికారి వెంట  మరో ఆరుగురు వ్యక్తులు  కరక కొండపైకి వెళ్లడం చర్చనీయాంశం అవుతున్నది. కాగా ఈ వ్యహారం నడిపించేందుకు కొందరు వ్యాపారులు రూ.35 లక్షలు ఖర్చుచేసి అధికారికంగా మైనింగ్ అధికారులను కరక క్వారీపై సర్వేకి పంపినట్టు తెలిసింది.  కరక కొండపై సుమారు 20 హెక్టార్లు  విస్తీర్ణంలో రంగురాళ్ల తవ్వకాల కోసం అనుమతులు తీసుకుంటామని, ముందుగా రంగురాళ్లు లభించే ప్రాంతం కోసం సర్వే చేయాలని వీరు మైనింగ్ అధికారులతో కలిసే రిజర్వ్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యారని తెలిసింది.  కరక రంగురాళ్ల క్వారీలో అక్రమంగా  కొన్ని ఏళ్ల క్రితం పెద్ద ఎత్తున తవ్వకాలు జరిగాయి. ఇక్కడ క్వారీలో జరిగిన ప్రమాదాల్లో  పలువురు చనిపోవడంతో ప్రభుత్వం అక్రమ తవ్వకాలను నిరోధించింది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు రంగురాళ్ల వ్యాపారులు తెలివిగా మైనింగ్ అధికారులను రంగంలోకి దించారనే ఆరోపణలు ఉన్నాయి. అసలు దరఖాస్తు లేనప్పుడు మైనింగ్ అధికారులు సర్వేకి ఎలా వస్తారని అటవీశాఖ ప్రశ్నిస్తోంది.  

రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీశాఖ అనుమతి లేకుండా ప్రవేశించడం నిషిద్ధమని.. ఈ విషయాన్ని తాము అటవీశాఖ ముఖ్య అధికారులకు తెలియజేశామని చెబుతున్నారు.   గనుల శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ సత్యమూర్తి తో పాటు గొలుగొండ మండలం సారిక మల్లవరం గ్రామానికి చెందిన రంగురాళ్ల వ్యాపారి కొల్లాన కొండలరావు, ఎల్లవరం గ్రామానికి ఆల్లు నూకరాజు రాజు , చోడవరం ప్రాంతానికి చెందిన పోతి శివకుమార్, కూర్మ దాసు అప్పలనాయుడు, ఒంటెద్దు వీర నాగేశ్వరరావు, రామచంద్రరావు అనేవారిని అదుపులోకి తీసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేశామని నర్సీపట్నం రేంజ్ ఆఫీసర్ లక్ష్మీ నర్సు చెప్పారు. రిజర్వ్ ఫారెస్ట్ లోకి అక్రమంగా ప్రవేశించిన ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నా మన్నారు. తేడాలు బయట పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రేంజర్ చెప్పారు. కానీ.. తెరవెనుక జరిగిన వ్యవహారాన్ని మాత్రం ఇటు అటవీశాఖ అధికారులు కూడా దాచిపెడుతున్నట్టు తెలిసింది. గనులశాఖకు ముందుగా లక్షల్లో కమిషన్లు ఇచ్చారని.. అంటే చాలా పెద్ద స్థాయిలోనే కరక రంగురాళ్ల క్వారాని తిరిగి అధికారికంగా చేజిక్కించుకోవాలని చూస్తున్నారని తేలిపోయింది. చూడాలి..ఈ విషయంలో తెరవెనున్న ఉన్నవారిని ఏ ప్రభుత్వశాఖ బయటపెడుతుందో..?!