రైతులను ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకోవాలి..ఆడారి కిషోర్


Ens Balu
9
Visakhapatnam
2023-10-31 10:05:50

 ఎన్నో సమస్యలతో  నిత్యం పోరాటం చేస్తున్న రైతులను ఆర్థికంగా, సామాజికంగా ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ను  మిషన్ కర్షక దేవోభవ ప్రాజెక్ట్ జాతీయ చైర్మన్ ఆడారి కిషోర్ కుమార్ కోరారు. విశాఖలో మంగళవారం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఇంటర్న్ షిప్ చేసిన డిగ్రీ విద్యార్థులకు సహయత వెల్ఫేర్ సొసైటీ అభినంద న కార్యక్రమం చేపట్టింది.  దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, రైతాంగం పై క్షేత్ర స్థాయి లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకునేం దుకు విద్యార్థులు పరిశోధన చేయడం అభినందనీయం అన్నారు.  తాము కర్షక దేవో భవ మిషన్ ద్వారా గ్రామ స్థాయి లో రైతుల అభ్యున్నతి కోసం ప్రజల్లోనూ, విద్యార్థుల్లోను, అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రసాయనాల వినియోగం తగ్గించుకోవచ్చునన్నారు. వ్యవసాయం పండుగలా మారేంతవరకూ అలుపెరగని చైతన్యం, అవగాహన తీసుకు వస్తామని చెప్పారు. విద్యార్ధులు కూడా అగ్రికల్చర్ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ బిఎస్సీ వంటి కోర్సులను చదవడంతోపాటు, ఎంఎస్సీ పీహెచ్డీలు చేసి నూతన వ్యవసాయ విధానాలు, కొత్తరం వంగడాలపై పరిశోధన చేసి రైతులకు అండగా నిలవాలన్నారు. రైతు రాజుగా మారడమే మిషన్ కర్షక దేవోభవ ప్రాజెక్ట్  లక్ష్యమని స్పష్టం చేశారు.  అనంతరం సహయత సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమం లో ఇంటెర్న్ షిప్ పూర్తి చేసిన  26 మంది డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి అషిత, శ్రీధర్ మల్లిక్, తదితరులు పాల్గొన్నారు.