డిజిపి, సిఐడి చీఫ్ ల అక్రమార్జన పై కోర్టులో కేసు వేస్తాం


Ens Balu
107
Visakhapatnam
2023-10-31 11:36:56

కక్ష పూరితంగా అక్రమ కేసులు పెట్టదమే కాక చట్టాలను తుంగలోకి తొక్కి ఆంధ్రప్రదేశ్ డిజిపి, సి ఐ డి చీఫ్ ల అక్రమార్జనపై కోర్టులో కేసులు వేయనున్నట్టు తెలుగు దేశం పార్టీ యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ తెలియచేశారు. మంగళవారం విశాఖలోని టిడిపి కార్యాలయంలో జరిగిన చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్రమ కేసులు పెట్టి గత 54 రోజులు జైల్లో ఉంచిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కు మధ్యంతర బెయిల్  మంజూరు కావడం ద్వారా న్యాయం ఇంకా బ్రతికే ఉంది అనే నమ్మకం జనంలో కలుగుతోందని అన్నారు. దీనిపై ఆడారి కిషోర్ కుమార్ స్పందిస్తూ.. అసలు పస లేని కేసులు పెట్టడమే మూర్ఖత్వం అని, దానిలో 54 రోజుల పాటు జైల్లో పెట్టడం వెనుక అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయన్నారు. దీనికి పూర్తిగా కథ నడిపించిన రాష్ట్ర డిజిపి, సిఐడి చీఫ్ లు వై ఎస్ జగన్ దగ్గర ఎంత ముడుపులు తీసుకున్నారో అందరికీ తెలియాలన్నారు. వీళ్ళిద్దరూ తమ ఆస్తులను ఇంతవరకూ ప్రకటించ లేదన్నారు. వీళ్ళ హోదా లో ఉండే ఇతర ఉద్యోగుల పోలిస్తే వీళ్ళకి ఉన్న ఆస్తులు ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటాయని మండిపడ్డారు. దీనిపై రాష్ట్ర హై కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసి అధికార పార్టీ చేసిన కక్ష లో వీళ్ళ భాగస్వామ్యం బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు సురక్షితంగా బయటకు రావాలి అని ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్య వాదాలు చెప్పారు.  అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీపీ - జన సేన సంయుక్త కమిటీ సమావేశంలో ఇరు పార్టీల నేతలతో కలిసి ఆడారి కిషోర్ కుమార్ పాల్గొన్నారు.