మీ సహకారం మరవలేనిది..!


Ens Balu
224
Visakhapatnam
2023-11-08 11:33:48

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో మొదటినుంచీ సహకరిస్తున్న జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. ఇదే సహకారాన్ని భవిష్యత్తులోనూ అందించాలని విజ్ఞప్తి చేసింది. సొసైటీ గౌరవ అధ్యక్షులు కె .జి.రాఘవేంద్ర రెడ్డి, జి .జనార్దన్ రావు, సొసైటీ అధ్యక్షులు బి. రవికాంత్ లు బుధవారం ఉదయం కలెక్టర్ ను శాలువా తో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ స్థాపించిన నాటి నుంచి విలువైన సలహాలు సూచనలతో సొసైటీ కి సరైన దిశా నిర్దేశం చేస్తూ సహకరించిన కలెక్టర్ మల్లికార్జున కు ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుల అక్రిడేషన్లు, హెల్త్ కార్డ్ లు జారీలో పారదర్శకం గా వ్యవహరించి... ఇప్పుడు ఇళ్ళ స్థలాల కేటాయింపు లోనూ కీలక భూమిక పోషించిన కలక్టర్ మల్లికార్జున కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కలక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ వచ్చిన వెంటనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు అంశాన్ని వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టుల పక్షపాతి గా వున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ గౌరవ సలహాదారులు పి సత్యనారాయణ, ధవలేశ్వరం రవికుమార్, ఉపాధ్యక్షులు కొయిలాడ పరుశురాం, దుక్కా మురళీకృష్ణ రెడ్డి, పి. రామకృష్ణ, సహాయ కార్యదర్శి ఎం. చిట్టిబాబు అనురాధ, బందరు శివ ప్రసాద్, కోశాధికారి ఆలపాటి శరత్ కుమార్, ప్రత్యేక ఆహ్వానితులు యర్రా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.