ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతోప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర సామాజిక కులగణనతో ఏ ఏ సామాజిక వర్గాల్లో ఎంతెంత మంది జానాబా ఉన్నారు, ఏ ఏ వర్గాల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనే విషయం అధికారికంగా తేలిపోతుందని ఉత్తరాంధ్ర విద్యార్ధి సేన వ్యవస్థాపక అధ్యక్షలు, వైఎస్సార్సీపీ రాష్ట్ర డా.సుంకరి రమణమూర్తి అన్నారు. మంగళవారం విశాఖలో యన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో చాలా సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ ఏఏ సామాజిక వర్గంలో ఎంతెంత మంది జనాభా ఉన్నారనే విషయంలో ఎక్కడా స్పష్టత లేదన్నారు. అయితే ఇపుడు రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న ఈ లెక్కల వలన అన్ని వర్గాల ప్రజలు, సామాజికవర్గాలు లెక్కలు తేలుతాయన్నారు. సామాజిక వర్గాల వారీగా సంఘాలు, అసోసియేషన్లు ఉన్నప్పటికీ నేడు ప్రభుత్వం చేపడుతున్న గణన కార్యక్రమంతో అధికారికంగా సామాజిక వర్గాల వారీగా మొత్తం సమాచారం ఆన్ లైన్ కూడా జరగుతుందన్నారు. తద్వారా అన్నివర్గాల ప్రజలకు సమానంగా అన్ని రంగాల్లోనూ ప్రాతినిధ్యం పెరగడానికి కూడా ఈ లెక్కలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇప్పటికే అన్ని సామాజిక వర్గాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ సమగ్ర కులగణన పూర్తిచేస్తే ఏఏ వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందలేదు..ఎంతమందికి అందాయి..ఇంకా ఎంతమందికి అందాల్సి వుంది తదితర వివరాలను కూడా తెలుసుకోవడానికి అవకాశం వుంటుందన్నారు. చాలా ఏళ్లతరువాత రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమం వలన రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గాల సంఖ్య అన్ని సామాజికవర్గాల ప్రజలకు తెలియడానికి మార్గం సుగమం అవుతుందన్నారు. దానికోసం ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమానికి అన్నిసామాజిక వర్గాల ప్రజలు స్వచ్చందంగా ముందుకి వచ్చి వివరాలు నమోదు చేసే సమయంలో సహకరించాలని ఉత్తరాంధ్ర విద్యార్ధి సేన వ్యవస్థాపక అధ్యక్షలు, వైఎస్సార్సీపీ రాష్ట్ర డా.సుంకరి రమణమూర్తి కోరుతున్నారు.