వైఎస్సార్సీపీ అరాచకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి


Ens Balu
39
Pendurthi
2023-11-15 11:05:08

ఆంధ్రప్రేదశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై ప్రజలకు అవగాహనకలిగేల పెద్ద స్థాయిలో డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించాలని మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ యువజన నాయకులు ఆడారి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో చేపడుతున్న డెమోక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమ గోడపత్రికను ఆయన తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీచేస్తూ, కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం పదడుగులు అభివృద్ధిలో ముందుకెళితే, వైఎస్సార్సీపి అధికారంలోకి వచ్చిన తరువాత 100 అడుగులు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. ముఖ్యంగా ఈ అరాచక ప్రభుత్వం వలన యువత భవిష్యత్తు నాశనం అయిపోయిందని అన్నారు. ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమం చేస్తున్న కిషోర్ ను ఈ సందర్భంగా బండారు అభినందించారు. యువజన నాయకులు కిషోర్ మాట్లాడుతూ, విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు అన్నివర్గాలకు జరిగిన అన్యాయంపైనా, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే డెమోక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఆయన తెలియజేశారు. ఉమ్మడి విశాఖజిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.