సీఐఐ యంగ్ ఇండియన్స్ మరో బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. బ్రెయిలీ లిపిలో తయారు చేసిన మెనూ కార్డులను హోటళ్లు, రెస్టారెంట్లలో అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం నోవాటెల్ వరుణ్‌బీచ్‌లోని జాఫ్రాన్ రెస్టారెంట్‌లో ఈ మెనూ కార్డును ప్రారంభించారు. ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బుచ్చి రాజు, డిఆర్‌ఇహెచ్ హెడ్ డాక్టర్ అల్లు పద్మజ, కేజీహెచ్ డాక్టర్ వాసుపల్లి రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దృష్టి లోపం ఉన్న అతిథులు మెనూను చదివి. ఎవరి సహాయం సహాయం కోరకుండా స్వతంత్రంగా ఆర్డర్ చేయగలిగినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. యంగ్ ఇండియన్స్ యాక్సెసిబిలిటీ చైర్ డా.త్రిప్తి యర్రామిల్లి, గౌరవ సభ్యురాలు కావ్య పూర్ణిమ, యంగ్ ఇండియన్స్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.