విశాఖలో ఘనంగా జాలాది విజయ జన్మదిన వేడుకలు


Ens Balu
64
Visakhapatnam
2023-12-01 16:08:01

తెలుగు సినీ ప్రపంచంలో జాలాది జ్ఞాపకాలు నేటికి అనేక రూపాల్లో పదిలంగానే ఉన్నాయని,  సినీ గేయరచయితగా సమాజాభిృద్ధికి తన వంతు చేయూతనందించడంతో పాటు ఎంతో మంది ప్రజల మన్నననలు పొందిన రచయిత జాలాది ఆశయ సాధనకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామని పలువురు వక్తలు కొనియాడారు. సమాజ్ వాద్ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్, రచయిత్రి జాలాది విజయ జన్మదిన వేడుకలు శుక్రవారం ఇక్కడ పౌర గ్రంధాలయంలో ఘనంగా నిర్వహించారు. పలువురు కళాకారులు, కళా సంఘాలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శాసనసమండలి సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, గౌరవ అతిధులుగా పైడా విద్యాసంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ జాలాది అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. తెలుగు సినీ రంగంలో నేటికి జాలాది జ్ఞాపకాలు అనేక రూపాల్లో పదిలంగా ఉన్నాయన్నారు. తండ్రి వారసత్వాన్ని ఆసరాగా తీసుకొని కుమార్తె జాలాది విజయ కూడా అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో రాణించాలని వీరంతా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జాలాది విజయ మాట్లాడుతూ తన శక్తి మేరకు సమాజ సేవ చేస్తానన్నారు. ఏ రంగంలో ఉన్నప్పటికి ఆ రంగంలో తాను పలువురికి సాయమందించే విధంగా ముందుకు సాగుతామన్నారు.  పలువురు జాలాది విజయకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నేతలు మేడా మస్థాన్ రెడ్డి, ఖాన్, బయా శ్రీనివాస్, వర్రె నాంచారయ్య, సన్ మూర్తి, రాతో గణేష్ తో పాటు పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొన్నారు.