ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో దోహపడతాయని..అదీ చిన్ననాటి నుంచే ఆ నేర్పించడం ద్వారా యుక్తవయస్సు వచ్చేనాటికి మరింత దృఢంగా రాటు దేలడానికి అవకాశం వుంటుందని టిడిపి యువనాయకులు, మిషన్ కర్షక దేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం విశాఖలో బోధి ధర్మ యుద్ధ కళా క్షేత్రం ఆధ్వర్యంలో బెల్డ్ గ్రేడింగ్ టెస్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధృడ భారతదేశ నిర్మాణంలో మార్ష్ట్స్ ఆర్ట్స్ కీలకభూమిక వహిస్తాయని అన్నారు. చిన్ననాటి నుంచే పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం ద్వారా శారీరకంగా, మానశికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కి చిన్నారుల ఆరోగ్యమే ఆలంబన అన్నారు. గ్రాండ్ మాష్టర్ ఆర్.దయామయ మాట్లాడుతూ, విశాఖ కేంద్రంగా బోధి ధర్మ యుద్ధ కళా క్షేత్రం యువతను మార్షల్ ఆర్ట్స్ లో తీర్చిదిద్దడానికి ఎంతో కృషిచేస్తుందన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఆయన సూచించారు. స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ డైరెక్టర్ పి.గోవింద్ మాట్లాడుతూ, ప్రతీఒక్క ఆడబిడ్డ మార్ట్స్ శిక్షణ తీసుకోవాలన్నారు. ఏయూ సబ్ ఆడిట్ ఆఫిసర్ భరత్ సూర్య మాట్లాడుతూ, చిన్నారులంతా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా చదువులో కూడా చురుకుగా ఉండటానికి వీలుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సాహో, సోషల్ వర్కర్ కమ్ మాస్టర్ వెంకట్, శ్రీకాకుళం మాస్టర్స్ లక్ష్మణ్ నాయుడు అధిక సంఖ్యలో విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.