మాడుగులలో 20 మంది సభ్యులతో కూడిన నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీని ఒక సంవత్సరం కాలపరిమితితో ఏర్పాటు చేస్తూ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో చోడవరం మాడుగుల కలిపి ఉన్న మార్కెట్ కమిటీని నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఈ కమిటీని ఏర్పాటు చేసారు. గౌరవ అధ్యక్షులుగా ఉపముఖ్య మంత్రి బూడి ముత్యాలనాయుడు,చైర్మెన్ గా సేనాపతి కొండల రావు, వైస్ చైర్మెన్ శ్రీనాదు శ్రీనివాసరావు సహా 17 మం ది సభ్యులతో కూడిన నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు ద్వారా రైతులకు వారి వ్యవసా య ఉత్పత్తుల సేకరణ, అమ్మకంలో మరింత సులభతరం అవుతుందని రైతులు హర్షం వెలిబుచ్చారు. డిప్యూటీ సిఎం చొరవతో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పడి మాడుగుల రైతులకు మేలు జరుగుతుందని అశాభావం వ్యక్తం చేశారు.