గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ఐసిడిఎస్ సిబ్బంది చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ఉపేక్షించేది లేదని డెమోక్రటిక్ అసోసియేషన్ ఆఫ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం విశాఖజిల్లా అధ్యక్షులు సూర్య హెచ్చరించారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ల ఆదేశాలను పాటించడంమ తమవిధని, అంతేతప్పా తమకు అంగన్వాడీలపై ఎలాంటి వ్యతిరేక ఆలోచన లేదన్నారు. శనివారం ఈ మేరకు ఆయన గాజువాలక లో ఏర్పాటు చేసిన ఉద్యోగుల సంఘం సమావేశంలో అంగన్వాడీలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీకు నచ్చినట్టు ఆందోళనలు చేసుకోవడం మీ హక్కు అని, అదే సమయంలో, సచివాలయ ఉద్యోగులపై మీడియా ప్రకటనలు, ప్రచారాలు సరికావన్నారు. ఆ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మీ హక్కుల కోసం పోరాడటం లో తప్పు లేదు కానీ సచివాలయ ఉద్యోగుల పై పడి ఏడవటం, విమర్శలు చేయడం సరికాదన్నారు. తామేమీ సొంత నిర్ణయాలు తీసుకోమని, ప్రభుత్వ ఆదేశాలను పాటించడమ తమ విధి అనే విషయాన్ని అంగన్వాడీలు తెలుసుకోవాలని సూచించారు. కార్యకర్తలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ప్రక్కన పెట్టి గ్రామ,వార్డు సచివాల యంలో పనిచేస్తున్న ఉద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడుతున్న మాటలను సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తాము ఎంతో కష్టపడి చదువుకొని డిఎస్సీ ద్వారా లక్షల మంది అభ్యర్ధులతో పోటీపడి మరీ ఉద్యోగాలు సాధించుకున్నామని, మా జాబ్ చార్ట్ ప్రకారం నడచుకోవడం మా కర్తవ్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో అయితే గ్రామ,వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిందో దానికి అనుగుణంగా గ్రామ,వార్డు స్థాయిలో నే ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజలకు నిజాయతీ గా నిస్వార్ధము గా అవినీతి రహితంగా పని చేస్తున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అంగన్వాడీలు ప్రవర్తించాలన్నారు. దేశం లో ఎక్కడ లేని విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని అటువంటి ఎంతో చక్కటి వ్యవస్థ ను తులనాడటం, నోటికొచ్చినట్టు మాట్లడటం సరికాదన్నారు. సచివాలయ ఉద్యోగులు కరోనా సమయం లో సైతం కనీసం సెలవులు తీసుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడటంలో ముందు ఉన్నారని గుర్తుచేశారు. అంగన్వాడీలు తమ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం ప్రతినిధులు బి.దివ్య, వి.క్రిష్ణ, ఎం.ప్రసాద్, అశోక్ కుమార్, పాల్గొన్నారు.