రైతు ఆర్ధికంగా అభివృద్ధి చెందినపుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ పేర్కొన్నారు. శనివారం అయన అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాలలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా విద్యార్ధులకు రైతులు, మిషన్ కర్షక దేవోభవపై అవగాహన కల్పించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రైతులకు ఆర్ధిక తోడ్పాటు పరిపూర్ణంగా ఇచ్చినపుడే వ్యవసాయం వృద్ధి చెంది, వాటి ఫలితాలతో ప్రజలు ఆరోగ్యం గా ఉం టారన్నారు. అదే సమయంలో వ్యవసాయా న్ని ప్రోత్సహించేందుకు, వారికి సరికొత్త వంగడాలను అందించేందుకు వీలుగా విద్యార్ధులు వ్యవసాయ విద్య ను అభ్యసిం చడంతోపాటు, సరికొత్త పరిశోధనలు చేయాలన్నారు. మనకి చేతినిండా డబ్బున్నా.. ఒక రైతు తన పనితాను చేయకపోయినా, వ్యయాసాయాన్ని పక్కనపె ట్టినా మాన వాళి ఆకలి తీరడం చాలా కష్టమైపోతుందన్నారు. రైతులు ఎంతో శ్రమించి వ్యవసాయం చేయడం ద్వారానే మనం సమయానికి ఆహారం తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడు తుందన్నారు. అలాంటి రైతులను ప్రోత్సహించడానికి వ్యవసాయాన్ని పండుగలా మార్చే కార్యక్రమంలో భాగంగనే మిషన్ కర్షకదేవోభవను ప్రారంభించి నేటికి 50రోజులు పూర్తిచేసుకోవడంతో పాటు అన్ని వర్గాల ప్రజల దగ్గరకు తీసుకెళు తున్నామని తెలి యజేశారు. పచ్చదనం పెంపొదించడంలో విద్యార్ధులు ముందుండాలని, ప్రతీ ఒక్కరూ తమ ఇంటి దగ్గర ఒక మూడు ఫలసాయాన్నిచ్చే మొక్కలు పెంచడం ద్వారా వ్యవసాయంపై ఆశక్తి పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో మిషన్ సభ్యులు పాల్గొన్నారు.