అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని నాతవరం ఎంపీపీ సాగిన లక్ష్మణుమూర్తి పేర్కొన్నారు. శనివారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా చూడాలన్నారు. త్వరితగతిన ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పూర్తయ్యేలాగా అధికారులు కృషి చేయాలని సూచించారు. మండలంలో పలు రకాల సమస్యలపై సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు ఎంపీపీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. సచివాలయాల పరిధిలోని సమస్యలను ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ మైనం నాగ గోపి, ఎంపీడీవో హనుమంతరావు, వివిధ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.