ప్రతీ ఒక్కరూ మట్టిని కాపాడుకోవడం ద్వారా జీవకోటి మనుగడ ప్రశ్నార్ధకం కాకుండా ఉంటుందని మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ పేర్కొ న్నారు. మంగళవారం విశాఖ ఎంవీపి కాలనీ నుంచి ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం సుబ్రమణ్యశర్మ అనే సామాజికవేత్త ప్రారంభించిన సేవ్ సాయిల్ రన్ కు ఆయన సం పూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనను కిషోర్ కుమార్ మార్గమధ్యలో కలిసి అభినందనలు తెలియజేశారు. 55ఏళ్ల వయస్సులో పుడమిపై ఉన్న ప్రేమ తో, ప్రతీ ఒక్కరికీ మట్టిపై అవగాహన కల్పిండానికి, మట్టిని కాపాడుకోవాలనే మంచి కాన్సెప్ట్ తో 33 కిలోమీటర్ల పరుగు చేపట్టడం చాలా గొప్పవిషయమన్నారు. మట్టి ని కాపాడుకుంటేనే.. రైతు వ్యవసాయం చేయడానికి ఆస్కారం వుటుందని, మొక్కలు నాటడానికి వీలుంటుందని.. తద్వారా రైతుకి పని, మనందరికీ ఆహారం సకాలంలో దొరుకుతుందని చెప్పారు. ఇలాంటి మంచి పనులకు తమవంతు మద్దతు ఎల్లప్పుడూ వుంటుందని సేవ్ సాయిల్ సుభ్రహ్మణ్యశాస్త్రికి తెలియజేశారు. ఈ సేవ్ సాయిల్ రన్ పూర్తయిన తరువాత తమన కార్యాలయానికి రావాలని కూడా ఆహ్వానించారు. అదేవిధంగా మిషన్ కర్షకదేవోభవ కోసం కిషోర్ కుమార్ ఆయనకు తెలియజేశారు.