కాలేజ్ విద్యార్థులకు మెరుగైన సదుపాయాల కోసం పూర్వవిద్యార్ధులు ముందుకి రావాలని తెలుగు దేశం యువ నేత, మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం అనకాపల్లి ఏఎంఏఎల్ కాలేజ్ కి ఆయన రూ.20 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ, తన జన్మదినోత్సవం సందర్భంగా చదువుకున్న కళాశాల అభివృద్ధి కోసం ఈ విరాళాన్నిఅందజేయడం ఆనందంగా ఉందన్నారు. చదువకున్న పాఠశాలలు, కళాశాలలకు విద్యార్ధులు తమవంతుగా ఏదో అంశంలో సహాయం చేయడం ద్వారా మరిన్ని సదుపాయాలు కల్పించడానికి అవకాశం వుంటుందన్నారు. తాను విద్యార్థి గా ఓనమాలు దిద్దుకున్నది ఇక్కడేనని, తాను నేడు సమాజంలో నాయకునిగా ఎదగడానికి ఇక్కడే బీజం పడిందన్నారు.ఈ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎదిగానని, ఆపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో సైతం విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎన్నికైనట్టు తెలిపారు. తాను చదువుకున్న కళాశాలలోని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ లభించడం కోసం సంపూర్ణ సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. విద్యార్థులకు సాంకేతిక పరమైన శిక్షణ కూడా ఏర్పాటు చేసి, అతి త్వరలోనే విద్యార్థుల ఉపాధి కోసం జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పారు. ఆ మొత్తాన్ని కళాశాల ప్రిన్సిపాల్ కు అందించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ గల్లా జయబాబు, యాజమాన్యం, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు బొడ్డేటి అప్పారావు, సూపరింటెండెంట్ అనురాధ, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ కే వి ఎస్ నాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు ఆడారి కిషోర్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ యువసేన ప్రతినిధులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.