కొత్త సంవత్సరం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు రాక్షస పాలన నుంచి విముక్తి కలుగుతుందని తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు వద్ద యువ తేజం ఆడారి కిషోర్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం చంద్రబాబు ను కలిసి కిషోర్ కుమార్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ సందర్భంగా చంద్ర బాబు ఉత్సాహ పూరిత సంభాషణ చేశారు. గతం లో చేసిన పరిపాలన కు మించి ఉజ్వల భవిష్యత్తు రాష్ట్ర ప్రజలకు అందించడమే తమ ముందున్న లక్ష్యం అన్నారు. ఈ సందర్భం గా రాష్ట్ర ప్రజలకు, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమాన, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, క్యాడర్ కు చంద్రబాబు నాయుడు, ఆడారి కిషోర్ కుమార్ లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాను,, ఉద్యోగులకి ఇచ్చిన హామీల విషయంలో రివర్స్ విధానంలో చేసిన మోసాలను శక్తివంచన లేకుండా ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ప్రజలందరూ ఇప్పటికే రాష్ట్రపాలనపై విసుగు చెంది ఉన్నారన్నారు. ఇచ్చింది రూపాయి అయితే ప్రజలపై భారం పది రూపాయలు వివిధ పన్నుల రూపంలో మోపుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను, కనిపించని దొంగపన్నులపైనా ప్రజలను చైతన్యం చేస్తామని అన్నారు.