తమన న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలకి కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు నూతన సంవతర్సం వేళ కోలాటమాడి తమ నిరసన తెలియ జేశారు. సోమవారం విశాఖలోని జివిఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమ్మె ప్రాంతంలో అంగన్వాడీలు కోలాటమాడారు. సాధారణంగా కోలాటంలో సదరు ఆటకు సంబంధించిన పాటలు ఉంటాయి. కానీ వీరు మాత్రం, వీరి డిమాండ్లనే పాటగా మార్చి, కోలాటమాడారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ, ఎందరో పిల్లలకు తల్లులుగా కేంద్రాల్లో వారి బాగోగులను చూసుకుంటూ, ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని అందిస్తూ సేవలందిస్తున్నామని వాపోయారు. తమకు కార్మిక చట్టాలను అను సరించి మాత్రమే తాము తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నామని, అంతే తప్పా అదనంగా ఎక్కడా ఏమీ కోరలేదన్నారు. అయితే ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకుండా చర్చలతో కాలయాపన చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ నిరవధిక సమ్మె ఉదృతం అవు తుంది తప్పితే ఎక్కడా విరమించే ప్రశక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు శ్యామలాదేవి, సరస్వతి, కుమారి, శాంతి, తదితరులు పాల్గొన్నారు.