సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్..ఎమ్మెల్యే వాసుపల్లి


Ens Balu
32
Visakhapatnam
2024-01-02 15:14:03

విశాఖలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ ప్రజలకు మార్గం చూపిస్తోంది. 
ప్రతి మంగళవారం మాదిరిగా దొండపర్తిలో 27, 41, 42 వార్డులకు సంబంధించి దొండపర్తి పరదేశమ్మ గుడి వద్ద ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించారు. ముఖ్యమంత్రి జగనన్న ఆశయం మేరకు ప్రజల వద్దకే పాలన కు ఆదర్శంగా తీసుకుని వినూత్న రీతిలో వారి సమస్యలు నేరుగా పరిష్కరించి ప్రజల ప్రశంసలు పొందుతున్నారు. ప్రభుత్వ పథకాలతో అవసరమైన ధ్రువపత్రాల మంజూరు, పెన్షన్లు, ఇళ్ళ కేటాయింపు, రేషన్ కార్డులు, వంటి వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేశారు.  దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వారికి ఆర్థిక సహాయం అందజేయాలని ఎమ్మెల్యేకు గోడు విన్నవించుకున్నారు. అలాగే గత వారం ప్రజా దర్బార్ లో వాలంటరీ ఉద్యోగం కోసం ఆర్జీలు పెట్టుకున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే తో పాటు కార్పొరేటర్లు, మండల ప్రెసిడెంట్స్, వార్డ్ ప్రెసిడెంట్స్, క్లస్టర్ ఇంచార్జెస్, స్టేట్ డైరెక్టర్లు, స్టేట్ & జిల్లా సీనియర్ నాయకులు, ఆలయ చైర్మన్లు, సచివాలయం కన్వీనర్స్, గృహశారదులు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు