బొలిశెట్టి అనుమతుంటే చాలు.. అక్రమ నిర్మాణమే


Ens Balu
1
s.rayavaram
2020-09-29 13:38:05

విశాఖజిల్లాలో ఒక సాధారణ మాజీ ఎంపీటీసీ ఎస్.రాయవరంలో రూలింగ్ చేయడం ప్రభుత్వ అధికారులకు, సిట్టింగ్  ఎమ్మెల్యే గొల్లబాబూరావుకి విస్మయాన్ని కలిగిస్తోంది... ఏదైనా నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతులు తీసుకున్నా, తీసుకోకపోయినా బొలిశెట్టి గోవిందరావు అనుమతి తీసుకుంటే చాలు...ఆ కట్టడాలను తనిఖీలు చేయడానికి ఏ ఒక్క అధికారి ఆ ఇరుప్రక్కలకు రాడు... వచ్చినా ఓహో ఇది బొలిశెట్టి అనుచరుడి నిర్మాణం కదా దీని జోలికి వెళ్లినా ఫలితం లేదనుకొని వెనక్కి వెళ్లిపోతారు..అలా ప్రభుత్వ అనుమతి లేకుండా బొలిశెట్టి అనుచరుడినని చెప్పుకుంటూ కేవలం జి ప్లస్ టు నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉన్న గ్రామ సచివాలయ పరిదిలో ఏకంగా నాలుగు అంతస్తుల కళ్యాణ మండపాన్ని నిబంధనలన్నీ మా చుట్టాలే నంటూ అధికారులను బెదిరించి మరీ నిర్మించేశారు..ఒక నిరుపేద ఒక్కసెంటు భూమిలో పాక వేసుకుంటే ఎక్కడలేని రూల్సు అకస్మాత్తుగా గుర్తుకొచ్చేసి ఆ పాకు కూల్చే వరకూ నిద్రపోని ప్రభుత్వ అధికారులు.. ఇక్కడ ప్రభుత్వ అనుమతి కంటే పెద్ద అనుమతి బొలిశెట్టి గోవిందు అనుమతి ఉండటంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అంతస్తులు శ్రీ వెంకటేశ్వరా కళ్యాణ మండపాన్ని స్థానిక ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల ముందే నిర్మించేసినా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. పైగా బొలిశెట్టి ప్రధాన అనచరుడినంటూ కర్రిధనరెడ్డి ఈ ఓనరుగా ఉన్న ఈ కళ్యాణ మండపాలకు వెళ్లడానికి నాలుగు వెపులా ఇరిగేషన్ కాలువలపై నిబంధనలకు విరుద్దంగా వంతెనలు కూడా నిర్మించాడు. ఈ విషయంపై సమాచారహక్కు చట్ట కార్యకర్త సోమిరెడ్డిరాజు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో విచారణకు వచ్చిన డిఇఇ సుజాత, ఏఈ చిన్నారావులను బొలిశెట్టి, ఎమ్మెల్యే గొల్లబాబూరావు పేర్లు చెప్పి బెదిరించి మరీ తరిమికొట్టాడు సదరు కళ్యాణ మండపం యజమాని. ఒక మాజీ ఎంపీటీసి పేరుతో జరుగుతున్న అక్రమనిర్మాణాలపై అటు రెవిన్యూ, గ్రామసచివాలయం, ఇటు ఇరిగేషన్, పోలీసు అధికారులు సైతం నోరు మెదకపపోవడం విచిత్రంగా వుందని సోమిరెడ్డి రాజు మీడియా ముందు వాపోయారు. ఎవరైనా నిరుపేదలు సెంటు స్థలంలో ఇళ్లు కట్టుకుంటే అనుమతులున్నాయా అంటూ ఆ పాకను పెకలించేంతవరకూ నిద్రపోని అధికారులు ఎస్.రాయవరంలో మాజీ ఎంపీటీసీ రూలింగ్ చేస్తూ, అక్రమ నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నా చోద్యం చూస్తున్నారని రాజు ఆరోపిస్తున్నారు. తక్షణమే అక్రమ నిర్మాణాలను తొలగించకపోతే జిల్లా కలెక్టరుని ఆశ్రయిస్తామని, లోకాయుక్తాకి ఫిర్యాదు చేస్తామని కూడా సోమిరెడ్డి హెచ్చరిస్తున్నారు. పైగా అభివ్రుద్ధి పనులకే పెద్దపీట వేసే ఎమ్మెల్యే గొల్లబాబూరావుని అక్రమాల ఊబిలోకి బొలిశెట్టి, అతని అనచరులు నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.