అనకాపల్లి గాంధీనగరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణం భారీ భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు,రాష్ట్ర అర్చక ఎగ్జామినర్ , రేజేటి గోప అప్పలాచార్యులు(చక్రవర్తి) కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెళ్లికాని యువతి యువకులు రుక్మిణి కల్యాణంలో పాల్గొంటే వారికి అతి త్వరలో వారి జీవితంలోకి ఒక మంచి వధువు కానీ వరుడు కానీ వచ్చి అతి తక్కువ సమయంలోనే వివాహం జరుగునున్న నమ్మకంతో ఈ కళ్యాణం జరిపించుకుంటారని అన్నారు. ఆ కారణంగానే అతి పుణ్యదినాలైన ధనుర్మాసంలో ఈ కళ్యాణం దేవాలయంలో జరిపిస్తున్నా మన్నారు. ఈ కళ్యాణంలో 108 మంది పెళ్ళికాని యువతీ యువకులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈ కళ్యాణం తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు దేవాలయానికి తరలివచ్చి శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణం తిలకించారు. కళ్యాణ అనంతరం కళ్యాణ అక్షింతలను అందుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.