కశింకోట సర్కిల్ మొట్టమొదటి సీఐ గా వినోద్ బాబు


Ens Balu
76
Anakapalle
2024-01-07 16:39:10

శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా అన్ని వర్గాల సహకారంతో సర్కిల్ పరిధిలో పోలీసు సేవలు అందిస్తామని సిఐ వినోద్ బాబు పేర్కొన్నారు. కశింకోట పోలిస్టేషన్ ను సర్కిల్ గా చేసిన తర్వాత  మొట్ట మొదటిగా ఆదివారం సిఐగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయనగరం జిల్లాకు చెందిన తాను  ఎస్సై గా  శ్రీకాకుళంలో పనిచేశానన్నారు. అక్కడి నుంచి  సిఐ గా పదోన్నతిపై ఇక్కడి వచ్చినట్టు చెప్పారు.  తాను శాంతి భద్రతల పర్యవేక్షణలో సిబ్బంది, ప్రజా సహకారంతో ముందుకు అడుగు వేస్తాను అన్నారు. రాబోయే సంక్రాంతి సంబరాల్లో ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు. 
ముఖ్యంగా ఇక్కడ ప్రధాన సమస్యగా వున్న ట్రాఫిక్ సమస్య పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మహిళలందరూ దిశ యాప్ ను వారి స్మార్ట్ ఫోన్ లలో ఇనిస్టాల్ చేసుకో వాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చునన్నారు. అన్నివేళలా ప్రజాసేవలో కశింకోట సర్కిల్ పనిచేస్తుందని సిఐవివరించారు.