రక్తదానం ప్రాణదానంతో సమానమని డెక్కన్ కంపెని వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ పి.వి.ఎస్.ఎస్ రాజు అన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో డెక్కన్ ఉద్యోగులు స్వచ్చందంగా వచ్చి రక్తదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెగా రక్తదాన శిబిరం ద్వారా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవడానికి సుమారు 320 మంది ఉద్యోగులు రక్తదానం చేశారని అన్నారు. వారందరినీ డెక్కన్ కంపెనీ యాజమాన్యం తరఫున అభినందించారు. మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ మేనేజర్ జగపతి రాజు మాట్లాడుతూ, తల సేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు రక్తం చాలా అవసరమని వారికోసం మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రత్యేకంగా తలసేమియా సెంటర్ ఏర్పాటు చేసిందన్నారు. సదరు ఆసుపత్రి ద్వారా కంపెనీ ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డెక్కన్ ఫైన్ కెమికల్స్ డైరెక్టర్ కె.వి.ఎల్ పి రాజు,మదర్ బ్లడ్ బ్యాంక్ గుప్త,ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ శ్రీనివాస్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.