వైఎస్సార్సీపీలో నవరత్నాలు ఎక్కడ? అని మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్ గండి బాబ్జి ప్రశ్నించారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో మూడు అంశాలు ఇప్పుడే చేసేస్తాం అంటున్నారు. టీడీపీ ప్రకటిం చింది కాబట్టి ఇప్పుడే అమలు చేస్తాం అంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తే టీడీపీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పుకోవాల న్నారు. 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు ఎక్కడ ఇచ్చారు? ఏ శాఖలో ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులను పెర్మినెంట్ చేస్తాను, చట్టబద్దత తీసుకొస్తామన్న ప్రభుత్వం ఎక్కడ చేసిందన్నారు. నవ రత్నాలులో 98 శాతం అమలు అంటారు.. ఎక్కడ ఇచ్చారు? విద్యుత్ 300 యూనిట్లు దాటితే రేషన్ కట్ అంటే ఎలా? అని వైఎస్సార్సీపీ నాయకులకు సవాల్ విసిరారు. ఉమ్మడి విశాఖకు ఇద్దరు మంత్రులను ఇచ్చారు. ఎమ్మెల్యే బదిలీలు చేసిన ప్రభుత్వం ఎక్కడ చూడలేదని ఆక్షేపించారు. ముందు ఈ రాష్ట్రం నుంచి వైఎస్సార్సీపీ ని ప్రజలు బదిలీ చేసే సమయం ఆశసన్నమైందని అన్నారు.